Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముంది? ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేయడం తమకు ఆశీర్వాదంతో సమానమని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముంది? ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు
X

ప్రగతి భవన్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఉపయోగంలో లేని ప్రగతిభవన్ ఎందుకని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలన్నారు.

Advertisement

అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పలువురు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని.. ప్రశ్నించారు.

కేసీఆర్ కూడా గతంలో నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని అన్నారు కదా.. అని గుర్తు చేశారు. నక్సలైట్ల ఎజెండాలో దొరల గడీలు బద్దలు కొట్టే అంశం కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో మాజీ నక్సలైట్లు లేరా? అని సీతక్క ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేయడం తమకు ఆశీర్వాదంతో సమానమని ఆమె వ్యాఖ్యానించారు.

Next Story