Telugu Global
Telangana

ఉత్తమ్‌ సీఎం కావడం ఖాయం.. రాజగోపాల్ రెడ్డి జోస్యం

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఉత్తమ్‌ సీఎం కావడం ఖాయం.. రాజగోపాల్ రెడ్డి జోస్యం
X

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఓ సమావేశంలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా సంబోధించారు. తర్వాత భవిష్యత్తులో ఉత్తమ్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ కామెంట్స్ చేశారు.

ఇప్పటికే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి మిస్ అయిందన్న రాజగోపాల్ రెడ్డి.. తన నాలుకపై మచ్చలు ఉన్నాయని, తాను ఏది చెప్పినా తప్పకుండా జరుగుతుందంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

First Published:  30 Aug 2024 2:50 PM GMT
Next Story