మంత్రి పదవిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి
తనకు మంత్రి పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
BY Vamshi Kotas13 March 2025 9:11 PM IST

X
Vamshi Kotas Updated On: 13 March 2025 9:11 PM IST
మంత్రి పదవి మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనోగతం చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభమని, కానీ ఆ పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేనని తెలిపారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి లోక్ సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని గెలవాలని తనకు అప్పగిస్తే.. నిద్రహారాలు మాని గెలిపించానన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అసెంబ్లీలో జగదీస్‌రెడ్డి చాలా అతి చేశారన్నారు. మేము ఎవ్వరిని టార్గెట్ చేయం.. తప్పు చేస్తే వదిలి పెట్టం.. ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి చైర్‌ను ప్రశ్నించడం సరికాదు. స్పీకర్ కుర్చీని ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. స్పీకర్‌ను అవమానించినందుకే చర్యలు తీసుకున్నాం. ఎథిక్స్ కమిటికి సిఫార్సు చేశాం’’ అని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
Next Story