Telugu Global
Telangana

పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌.. మాకూ ఛాన్సివ్వండి.!

కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాత్రమే ప్రస్తావిస్తూ అభివృద్దిని, సృష్టించిన ఆస్తులను ఉద్దేశపూర్వకంగా దాచే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌.. మాకూ ఛాన్సివ్వండి.!
X

తెలంగాణ తొలి అసెంబ్లీ సెషన్‌లోనే అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరుగుతోంది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టేందుకు ప్రభుత్వం అస్త్రాలు రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలన్నింటిపైనా శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇదే అంశంపై డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. 2014లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి, పదేళ్ల బీఆర్ఎస్ పాలన సహా విద్యుత్ లాంటి కీలక రంగాలపై అసెంబ్లీలో భట్టి వివరిస్తారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సైతం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు లేఖ రాశారు. ప్రభుత్వానికి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశమిస్తే.. తమకు కూడా అందుకు ఛాన్సివ్వాలని లేఖలో కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాత్రమే ప్రస్తావిస్తూ అభివృద్దిని, సృష్టించిన ఆస్తులను ఉద్దేశపూర్వకంగా దాచే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పుల పేరుతో ఆరు గ్యారెంటీలను ఎత్తేసేందుకు కుట్ర చేస్తోందంటున్నారు.

First Published:  19 Dec 2023 11:28 AM GMT
Next Story