Telugu Global
Telangana

జాతీయ స్థాయిలో మళ్ళీ గుర్తింపు పొందిన మిషన్ కాకతీయ

ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటీవ్ నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపరేటీవ్ (పోటీతత్వం, సామాజిక పురోగతి ఆవశ్యకత సంస్థ రూపొందించిన రాష్ట్రాలు, జిల్లాల సామాజిక ప్రగతి సూచిక (SPI) తాజా నివేదికను అధికారులు ఆర్థిక సలహా మండలికి, ప్రధాన మంత్రికి సమర్పించారు. వివిధ రాష్ట్రాల్లో భూగర్భజలాల స్థాయిలను గుర్తిస్తూ ఈ రిపోర్ట్ తయారు చేశారు.

జాతీయ స్థాయిలో మళ్ళీ గుర్తింపు పొందిన మిషన్ కాకతీయ
X

భూగర్భ జలాలను పెంచ‌డంలో, సాగునీరు, తాగునీటి అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమమైన మిషన్ కాకతీయ జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు పొందింది.

ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటీవ్ నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపరేటీవ్ (పోటీతత్వం, సామాజిక పురోగతి ఆవశ్యకత సంస్థ రూపొందించిన రాష్ట్రాలు, జిల్లాల సామాజిక ప్రగతి సూచిక (SPI) తాజా నివేదికను అధికారులు ఆర్థిక సలహా మండలికి, ప్రధాన మంత్రికి సమర్పించారు. వివిధ రాష్ట్రాల్లో భూగర్భజలాల స్థాయిలను గుర్తిస్తూ ఈ రిపోర్ట్ తయారు చేశారు.

నివేదిక ప్రకారం తెలంగాణలో హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మాత్రమే భూగర్భ జలాల అతి వాడకం జరిగింది. మిగతా 23 జిల్లాలు ‘సురక్షిత’ కేటగిరీలో ఉన్నాయి.

రాష్ట్రంలో నీటి మట్టం పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న క్రియాశీలక చర్యలను నివేదిక వివరించింది.

కొన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాలు తీయాల్సిన దానికన్నా అధిక శాతం వెలికి తీస్తున్నారు. నివేదిక ప్రకారం, హర్యానా 134.56%, రాజస్థాన్ 150.22%, పంజాబ్ 164.42%, ఢిల్లీ 101.40% వెలికి తీస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో అతిగా భూగర్భ జలాల వాడకం వల్ల అక్కడ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అయితే అరుణాచల్ ప్రదేశ్ 0.36%, సిక్కిం 0.86%, నాగాలాండ్ 1.04%, అండమాన్ నికోబార్ దీవులు 2.6%, మిజోరాం 3.81% భూగర్భ జలాల వాడకంతో సురక్షిత పరిధిలోఉన్నాయి.

తెలంగాణలో భూగర్భ జలాల వాడకం ఉన్నప్పటికీ మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు విపరీతంగా పెరుగుతున్నాయని నివేదిక గుర్తించింది.

First Published:  12 Jan 2023 6:13 AM GMT
Next Story