Telugu Global
Telangana

మైనార్టీలకు లక్ష.. 27వేల మందికి సాయం

రాష్ట్రవ్యాప్తంగా 27వేలమంది మైనార్టీలకు ఈ సాయం అందుతుందని చెప్పారు. తొలిరోజు 10వేలమందికి చెక్కులు అందిస్తున్నామన్నారు. నూరు శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధిదారుడికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

మైనార్టీలకు లక్ష.. 27వేల మందికి సాయం
X

కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలబడుతుందని చెప్పారు మంత్రి కొప్పుల ఈశ్వర్. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మైనార్టీలకు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 27వేలమంది మైనార్టీలకు ఈ సాయం అందుతుందని చెప్పారు. తొలిరోజు 10వేలమందికి చెక్కులు అందిస్తున్నామన్నారు. నూరు శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధిదారుడికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. 9 ఏళ్ల కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 2,200 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్ లో కేటాయించామన్నారు.

బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ లో ఎలాంటి అల్లర్లు, అలజడి లేకుండా చేయగలిగామని, రాష్ట్రవ్యాప్తంగా జనరంజక పాలన కొనసాగుతోందని చెప్పారు మంత్రి కొప్పుల ఈశ్వర్. గతంలో మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకు దూరంగా ఉండే పరిస్థితి ఉండేదని, తెలంగాణ ఏర్పాటయ్యాక 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. లక్షమందికి పైగా విద్యార్ధులకు పూర్తిగా ఉచితంగా విద్య అందుతోందని చెప్పారు. నిరుపేద మైనార్టీ విద్యార్ధులు విదేశాల్లో చదువుకోడానికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద ఒక్కోమైనార్టీ విద్యార్ధికి 20 లక్షలకు పైగా ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు మంత్రి కొప్పుల.

First Published:  19 Aug 2023 10:52 AM GMT
Next Story