Telugu Global
Telangana

రైతుబంధు వేశాం.. చెక్‌ చేసుకోండి..!

సంక్రాంతి తర్వాత మరోసారి రైతుబంధు పంపిణీ జరుగుతున్న తీరుపై రివ్యూ చేస్తానని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. నిర్ణీత గడువులో రైతులకు రైతుబంధు పంపిణీ చేస్తున్నామన్నారు.

రైతుబంధు వేశాం.. చెక్‌ చేసుకోండి..!
X

రైతుబంధు నిధుల విడుదలపై ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. రైతుబంధు నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రివ్యూ నిర్వహించారు. ఈ మేరకు వివరాలతో కూడిన ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు. రివ్యూ మీటింగ్‌లో ఇప్పటివరకూ ఎంత మంది రైతులకు రైతుబంధు సాయం అందిందనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు తుమ్మల. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ సెక్రటరీ హాజరయ్యారు.

ఇప్పటివరకూ 40 శాతం మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు ప్రెస్‌నోట్‌లో తెలిపారు. దాదాపు 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు ఆర్థికసాయం జమ అయినట్లు స్పష్టం చేశారు. చివరి రైతు ఖాతాలో నగదు జమ అయ్యే వరకు పంపిణీ జరగాలని అధికారులకు ఆదేశించారు మంత్రి తుమ్మల. ఇక సోమవారం నుంచి మరింత ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు.

సంక్రాంతి తర్వాత మరోసారి రైతుబంధు పంపిణీ జరుగుతున్న తీరుపై రివ్యూ చేస్తానని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. నిర్ణీత గడువులో రైతులకు రైతుబంధు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు, వ్యవసాయానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. రైతుబంధు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు తుమ్మల.

First Published:  6 Jan 2024 4:34 PM GMT
Next Story