Telugu Global
Telangana

అమీర్‌ పేటలో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టిస్తా..

1994లో ఎన్టీఆర్.. శ్రీనివాస్ యాదవ్ అనే చిన్న మొక్క నాటారని, అదిప్పుడు పెద్ద వృక్షమైందని అన్నారు మంత్రి తలసాని. గతాన్ని తానెప్పుడూ మరచిపోనని, తన జీవితం ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటానని స్పష్టం చేశారు. ఓట్లకోసం తానీ మాటలు చెప్పడం లేదన్నారు.

అమీర్‌ పేటలో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టిస్తా..
X

తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తన ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ ని మరచిపోనని చెప్పారాయన. కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన మహోత్సవంలో తలసాని పాల్గొన్నారు. ఎన్టీఆర్ మహానుభావుడని కొనియాడారు. అమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తానన్నారు.

రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు మంచివి కావన్నారు మంత్రి తలసాని. పెద్ద మనిషి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబుని అరెస్ట్ చేయడం బాధాకరం అన్నారు. ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఆ ఘటనను తాను ఖండిస్తున్నానని చెప్పారు. వ్యక్తులను హింసించాలి, కేసులు పెట్టాలనే ఆలోచన రావడం దుర్మార్గం అన్నారు. ఎన్నికలున్నాయి, తనకేదో నాలుగు ఓట్లు వస్తాయని ఈ మాటలు చెప్పడంలేదని, గతంలోనే తాను చంద్రబాబు అరెస్ట్ ని ఖండించానని చెప్పారు తలసాని.

1994లో ఎన్టీఆర్.. శ్రీనివాస్ యాదవ్ అనే చిన్న మొక్క నాటారని, అదిప్పుడు పెద్ద వృక్షమైందని అన్నారు మంత్రి తలసాని. గతాన్ని తానెప్పుడూ మరచిపోనని, తన జీవితం ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటానని స్పష్టం చేశారు. ఓట్లకోసం తానీ మాటలు చెప్పడం లేదన్నారు.

First Published:  18 Nov 2023 3:51 PM GMT
Next Story