Telugu Global
Telangana

అంబటిని పెద్దిరెడ్డి అంతమాట అనేశారేంటి..?

ఆ వీడియో ఇప్పటిది కాదు, కానీ సబ్జెక్ట్ మాత్రం కాస్త హాట్ హాట్ గా సాగేదే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారడం విశేషం.

అంబటిని పెద్దిరెడ్డి అంతమాట అనేశారేంటి..?
X

మంత్రి అంబటి రాంబాబు ఆవేశాన్ని, ఘాటుగా విమర్శించే వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తూ మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎల్లోమీడియాకు అనుకోని వరంలా దొరికాయి. పెద్దిరెడ్డి వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ అటు సోషల్ మీడియా కూడా హోరెత్తిపోతోంది. ఇంతకీ పెద్దిరెడ్డి ఏమన్నారు..? అంబటిని అంత తేలిగ్గా ఆయన తీసిపారేశారా..?

ఆవీడియో ఇప్పటిది కాదు, కానీ సబ్జెక్ట్ మాత్రం కాస్త హాట్ హాట్ గా సాగేదే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారడం విశేషం. ఇంతకీ పెద్దిరెడ్డి ఏమన్నారంటే..? "ఒక రాజకీయ నాయకుడిగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. ఆ విలువలకు లోబడే నేను మాట్లాడగలుగుతా. మా అంబటి రాంబాబు మాదిరి నేను మాట్లాడను" అన్నారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.


అంబటిని కించపరచడం మంత్రి పెద్దిరెడ్డి ఉద్దేశం కాదు. కానీ విమర్శల డోసు విషయంలో తాను కాస్త తగ్గే ఉంటానని పెద్దిరెడ్డి చెప్పాలనుకున్నారు. కానీ అక్కడ విలువలు పాటించడం అనే మాట తేడా కొట్టింది. తాను విలువలు పాటిస్తాను, కానీ అంబటిలా మాట్లాడను అనే సరికి.. మంత్రి అంబటి విలువలు పాటించని వ్యక్తిలాగా కనపడుతున్నారా అని టీడీపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అంబటిని, పెద్దిరెడ్డి తీసిపారేసినట్టు మాట్లాడారని లేనిపోని సింపతీ చూపెడుతోంది. అంబటికి లేని నొప్పి టీడీపీ అనుకూల మీడియాకి వచ్చింది. ఈ ఎపిసోడ్ పై వైసీపీ నుంచి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి రియాక్షన్ లేదు.

First Published:  8 Oct 2023 7:56 AM GMT
Next Story