Telugu Global
Telangana

ఓటీటీలో చూడటానికి మంచి సినిమాలు చెప్పండి : మంత్రి కేటీఆర్

భారీ వర్షాలు పడుతూ, వరదలు వస్తున్నందున పుట్టిన రోజు వేడుకలు చేసుకోవట్లేదని ప్రకటించారు.

ఓటీటీలో చూడటానికి మంచి సినిమాలు చెప్పండి : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చిన్న ప్రమాదానికి గురయ్యారు. శనివారం ఆయన కింద పడటంతో చీలమండకు గాయం అయ్యింది. డాక్టర్లు పాదం కదలకుండా కట్టుకట్టారు. బయటకు వెళ్లకుండా మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు సలహా ఇచ్చారు. దీంతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని రోజులు దూరం కానున్నారు. ఇవాళ కేటీఆర్ మహీంద్ర యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రతో పాటు మరి కొందరితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాతే కేటీఆర్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.


కాగా, మూడు వారాలు ఇంటిలోనే ఉంటున్నాను కాబట్టి.. ఓటీటీలో చూడటానికి ఏవైనా మంచి వెబ్ సిరీస్, షోస్ ఉంటే చెప్పాలంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. రేపు పుట్టిన రోజు జరుపుకోబోతుండగా.. ఇలా గాయం కావడంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, అంతకు ముందే భారీ వర్షాలు పడుతూ, వరదలు వస్తున్నందున పుట్టిన రోజు వేడుకలు చేసుకోవట్లేదని ప్రకటించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మీరు కూడా కేటీఆర్ ఏం షో చూడాలో సలహా ఇవ్వాలనుకుంటే ట్విట్టర్ అకౌంట్‌లోకి వెళ్లి మెసేజ్ చేయండి.

Next Story