Telugu Global
Telangana

ఇది నా బ్యాడ్జ్.. ఇది నా గౌరవం

తెలంగాణ పోరాటంలో తన పాత్ర అది అని గుర్తు చేసుకున్నారు మంత్రి కేటీఆర్. పోలీసులు తనని తీసుకెళ్తున్న ఫొటోను, పోలీస్ వాహనంలోనుంచి తాను బయటకు చూస్తున్న ఫొటోని కూడా ట్వీట్ కు జత చేశారు.

ఇది నా బ్యాడ్జ్.. ఇది నా గౌరవం
X

ఈసీ ఆంక్షలు విధించినా కూడా ఈరోజు దీక్షా దివస్ ని నిర్వహించి కోట్లాదిమంది ప్రజల ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. విదేశాలలో దీక్షా దివస్ నిర్వహించిన ప్రతి ఒక్కరినీ ఆయన సోషల్ మీడియా వేదికగా అభినందించారు. ఆయా దేశాల్లో దీక్షా దివస్ ఫొటోలను రీట్వీట్ చేస్తూ అభినందనలు తెలియజేశారు. 2009 నవంబర్ 29న జరిగిన ఘటనల సమాహారాన్ని కూడా ఆయన తన ట్వీట్ లో గుర్తు చేశారు. ఆరోజు తన అరెస్ట్ ని గుర్తు చేస్తూ అప్పటి పోలీసులు ఇచ్చిన బ్యాడ్జ్ ని కూడా ట్వీట్ చేశారు కేటీఆర్.

వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీల ఐడెంటిటీ కార్డ్ అది

నెంబర్ - 3077

కేస్ క్రైమ్ నెంబర్ - 447/2009

సెక్షన్లు - 114, 117 రెడ్ విత్ 153(ఎ), 188, 290, 506ఐపీసీ

కేసు నమోదైన పోలీస్ స్టేషన్ - హన్మకొండ

కోర్టు - ఆరో అదనపు JFCM (కోర్ట్ ఆఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్), వరంగల్


తెలంగాణ పోరాటంలో తన పాత్ర అది అని గుర్తు చేసుకున్నారు మంత్రి కేటీఆర్. పోలీసులు తనని తీసుకెళ్తున్న ఫొటోను, పోలీస్ వాహనంలోనుంచి తాను బయటకు చూస్తున్న ఫొటోని కూడా ట్వీట్ కు జత చేశారు. తాము పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకు పోతోందని, అది తమకు గర్వకారణం అని చెప్పారు కేటీఆర్.

First Published:  29 Nov 2023 4:01 PM GMT
Next Story