Telugu Global
Telangana

ఎవరికీ ఉద్యోగాల్లేవు.. అయినా అంతా బాగానే ఉంది..!

అచ్చే దిన్ అంటూ ఊదరగొడుతున్న మోదీ ప్రభుత్వ హయాంలో ఖాళీలు ఏకంగా 25శాతానికి చేరుకోవడం విశేషం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలను దుయ్యబట్టారు.

ఎవరికీ ఉద్యోగాల్లేవు.. అయినా అంతా బాగానే ఉంది..!
X

భారత్ లో నిరుద్యోగితపై అదిరిపోయే సెటైర్ పేల్చారు మంత్రి కేటీఆర్. గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆధారాలతో సహా ట్వీట్ వేశారు. అచ్చేదిన్ అని చెప్పుకుంటున్న మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగిత కొత్త రికార్డులు సృష్టించిందన్నారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కొత్త శిఖరాన్ని చేరుకుంటున్నాయని తెలిపారు.

ఏ శాఖలో ఎన్నెన్ని ఖాళీలు..

కేంద్ర ప్రభుత్వం ఖాళీల భర్తీకు మొగ్గు చూపకపోవడంతో వివిధ శాఖల్లో భర్తీ కాని ఉద్యోగాలు లక్షల సంఖ్యల్లో ఉన్నాయి.

రెవెన్యూలో 41.6 శాతం

సైన్యంలో 40.2 శాతం

రైల్వేలో 20.5 శాతం

హోం శాఖలో 11.1 శాతం ఖాళీలు భర్తీకావాల్సి ఉంది. వీటి గురించి ఏనాడూ ప్రధాని మోదీ మాట్లాడరని, ఇన్ని ఖాళీలు ఉన్నా, ఇంతమంది నిరుద్యోగులు బాధపడుతున్నా. భారత్ లో అంతా బాగానే ఉంది అనే ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు కేటీఆర్.


2004లో భారత్ వెలిగిపోతోంది అని చెప్పుకునేనాటికి దేశంలో ఖాళీగా ఉన్న పోస్ట్ లు 12.1 శాతం. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. అవినీతి విమర్శలు, పథకాల అమలులో అవస్థలు ఉన్న సందర్భంలో ఖాళీలు 11శాతంగా ఉన్నాయి. ఇక అచ్చే దిన్ అంటూ ఊదరగొడుతున్న మోదీ ప్రభుత్వ హయాంలో ఖాళీలు ఏకంగా 25శాతానికి చేరుకోవడం విశేషం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలను దుయ్యబట్టారు. ఓవైపు ఖాళీలున్నాయి, మరోవైపు ఉద్యోగాలు లేవు, అయినా అంతా బాగానే ఉంది అనే ప్రచారం మాత్రం ఆగడం లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్.

First Published:  6 July 2023 6:22 AM GMT
Next Story