Telugu Global
Telangana

ఢిల్లీ 'చెప్పులు' మోసే గుజరాతీ గులాములు - కేటీఆర్ ధ్వజం

ఢిల్లీ 'చెప్పులు' మోసే గుజరాతీ గులాములు అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోడానికి సబ్బండ వర్ణం సిద్ధంగా ఉందని చెప్పారాయన.

ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములు - కేటీఆర్ ధ్వజం
X

అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన క్రమంలో ఆ వీడియోని రీట్వీట్ చేస్తూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ 'చెప్పులు' మోసే గుజరాతీ గులాములు అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోడానికి సబ్బండ వర్ణం సిద్ధంగా ఉందని చెప్పారాయన.

"ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను - ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని - తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉన్నది." అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

అమిత్ షా ప్రసంగంపై కూడా కేటీఆర్ తనదైన శైలిలో చెణుకులు విసిరారు. రైతు వ్యతిరేకిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ని అమిత్ షా పేర్కొనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ గా అభివర్ణించారు కేటీఆర్. కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి పీఎం-కిసాన్ అంటూ పేరు మార్చిందెవరంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. రైతు చట్టాలతో 700 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత ఆ చట్టాలను వెనక్కు తీసుకుంటూ క్షమాపణ చెప్పిందెవరని అడిగారు..? వారిని రైతు ద్రోహులంటారని మండిపడ్డారు.

పసలేని బీమా..

ఫసల్ బీమా పథకంలో తెలంగాణ చేరకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారని అసలు ఆ పథకాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే తిరస్కరిస్తున్నాయని చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం కూడా ఫసల్ బీమా యోజనను తిరస్కరించిందని అన్నారు. మీ సొంత రాష్ట్రానికే పనికిరాని ఫసల్ బీమాని తెలంగాణపై ఎందుకు రుద్దాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. వారికి పనికిరాని పథకం, తెలంగాణకు మంచిదెలా అవుతుందన్నారు. వారి ద్వంద్వ నీతికి ఇదే నిదర్శనం అని చెప్పారు కేటీఆర్.

First Published:  22 Aug 2022 5:40 AM GMT
Next Story