Telugu Global
Telangana

ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లో తెలంగాణ బెంచ్‌మార్క్‌ - కేటీఆర్‌

తెలంగాణలో వెయ్యికిపైగా ఎస్సీ, బీసీ, ఎస్టీ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయన్నారు. ఇందులో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయని వివ‌రించారు కేటీఆర్.

ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లో తెలంగాణ బెంచ్‌మార్క్‌ - కేటీఆర్‌
X

విద్యా రంగానికి పెద్ద‌పీట వేయ‌డం, అత్యున్నతమైన విద్యా సౌకర్యాలను సృష్టించడం ద్వారా బీఆర్ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను సాధికారత దిశ‌గా న‌డిపిస్తోంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. గడిచిన 9 ఏళ్ల పాలనలో ఆయా రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిపై గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌ వేదికగా వివరిస్తున్న కేటీఆర్‌.. తాజాగా విద్యారంగంలో సాధించిన పురోగతి గురించి వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ఓ బెంచ్‌ మార్క్‌ సెట్ చేసిందన్నారు. గడిచిన 9 ఏళ్లలో వందలాది రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌ ఏర్పాటు చేశామన్నారు. స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించామని చెప్పారు.

తెలంగాణలో వెయ్యికిపైగా ఎస్సీ, బీసీ, ఎస్టీ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయన్నారు. ఇందులో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయని వివ‌రించారు కేటీఆర్. అనేక పోటీ పరీక్షల్లో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని చెప్పుకొచ్చారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సైతం సాధించారన్నారు. 2014-23 మధ్య జరిగిన ప్రగతిని లెక్కలతో సహా వివరించారు.

మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మొత్తం మూడు విడతల్లో రూ.7,289 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 26 వేలకు పైగా స్కూల్స్‌ ఆధునీకరించామన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి అనేక విద్యా సంస్థలు నెలకొల్పామన్నారు. దీంతో పాటు అనేక స్టడీ సర్కిల్స్, లైబ్రరీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

First Published:  18 Nov 2023 9:29 AM GMT
Next Story