Telugu Global
Telangana

తెలంగాణలో చేనేత మ్యూజియం - కేటీఆర్ హామీ

చేనేత కళలో మెళకువలు, ఆ కళ గొప్పదనం భవిష్యత్ తరాలకు తెలియజెప్పేలా చేనేత మ్యూజియాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. భారత్ లోనే ఈ మ్యూజియం మొట్టమొదటిది అవుతుందని చెప్పారు.

తెలంగాణలో చేనేత మ్యూజియం - కేటీఆర్ హామీ
X

తెలంగాణలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. చేనేత కళ అంతరించిపోకూడదని, భవిష్యత్ తరాలకు దాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. చేనేత కళలో మెళకువలు, ఆ కళ గొప్పదనం భవిష్యత్ తరాలకు తెలియజెప్పేలా చేనేత మ్యూజియాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు. భారత్ లోనే ఈ మ్యూజియం మొట్టమొదటిది అవుతుందని అన్నారు కేటీఆర్.

చేనేత ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం..

దిల్‌సుఖ్‌ నగర్‌.. శ్రీనగర్‌ కాలనీలో పద్మశ్రీ గజం గోవర్ధన నివాసంలో ఏర్పాటు చేసిన చేనేత ఆర్ట్‌ గ్యాలరీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చేనేత ఆర్ట్‌ గ్యాలరీని ప్రారంభించడం తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నానని అన్నారు కేటీఆర్. ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత కళాకారుల సంక్షేమానికి పాటుపడుతున్న గజం గోవర్ధనను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు, ఎమ్మెల్సీ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి.. స్థానిక నాయకులు, చేనేత కళాకారులు పాల్గొన్నారు.

ఆ ఘనత కేసీఆర్ దే..

చేనేత కళను, చేనేత కళాకారులను ప్రోత్సహించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు కేటీఆర్. పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబాలకు నేతన్న ధీమా పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. చేయూత, చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాలపై 40శాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం జీఎస్టీ పేరుతో చేనేతల కార్మికులపై పెను భారం మోపిందని మండిపడ్డారు కేటీఆర్. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తేయాలంటూ టీఆర్ఎస్ తరపున పోరాటం మొదలు పెట్టామని, పోస్ట్ కార్డ్ ఉద్యమం, ఆన్ లైన్ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

First Published:  29 Oct 2022 3:11 AM GMT
Next Story