Telugu Global
Telangana

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కల్పతరువు -కేటీఆర్

ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశామన్నారు కేటీఆర్. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేస్తామని ప్రకటించారు. గతంలో వచ్చిన‌ వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్‌ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కల్పతరువు -కేటీఆర్
X

దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగుతుందని, ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో తాము ముందుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్ ను ఈ రోజుప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం కల్పతరువు వంటిందన్నారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కరెంటు సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు.

ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశామన్నారు. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేస్తామని ప్రకటించారు. గతంలో వచ్చిన‌ వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్‌ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తిచేస్తామన్నారు. వంద శాతం సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. దీంతో దేశంలోనే తొలి వందశాతం సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ సిటీగా హైదరాబాద్‌ అవతరించబోతున్నదని చెప్పారు.

రాబోయే 50 ఏండ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకిశాల మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

గత వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్‌ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు. మార్చి, ఏప్రిల్‌ నాటికి స్ట్రాటజిక్‌ నాలా కార్యక్రమం పూర్తిచేస్తామన్నారు. వంద శాతం సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. దీంతో దేశంలోనే తొలి వందశాతం సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ సిటీగా హైదరాబాద్‌ అవతరించబోతున్నదని చెప్పారు.

మరో మూడేళ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకురానున్నామని అన్నారు. ఇక, రాష్ట్రంలో కరెంటు సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. రాబోయే 50 ఏళ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకిశాలను మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

First Published:  1 Jan 2023 11:02 AM GMT
Next Story