Telugu Global
Telangana

మెడికో ప్రీతి కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ..

ప్రీతి కుటుంబ స‌భ్యుల‌తో కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి కేటీఆర్. ప్రీతి లాంటి ఘ‌ట‌న మ‌ళ్ళీ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తామని హామీ ఇచ్చారు.

మెడికో ప్రీతి కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ..
X

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మెడికో ప్రీతి కుటుంబాన్ని కలిశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రీతి చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు.

ప్రీతి కుటుంబ స‌భ్యుల‌తో కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి కేటీఆర్. ప్రీతి మృతికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉందని, సంబంధిత నివేదిక‌లు వ‌స్తున్నాయని చెప్పారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక క‌మిటీని కూడా వేసిందని గుర్తు చేశారు. దోషులు తేలిన త‌ర్వాత ఎంత‌టి వారైనా వ‌దిలేది లేదన్నారు. ప్రీతి లాంటి ఘ‌ట‌న మ‌ళ్ళీ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తామని హామీ ఇచ్చారు.


ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకుంటామని మరోసారి హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ప్రీతి కుటుంబ స‌భ్యులు మంత్రి కేటీఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రీతికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదన్నారు. పేదింటి బిడ్డ ఉన్నత చదువులతో కుటుంబానికి అండగా ఉంటుందని ఆశించామని, అర్థాంతరంగా తనువు చాలించిందని చెప్పారు ప్రీతి కుటుంబ సభ్యులు. చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉండే ప్రీతి, ఆత్మహత్య చేసుకునేంత పిరికి అమ్మాయి కాదని, ఆమె మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

First Published:  8 March 2023 4:42 PM GMT
Next Story