Telugu Global
Telangana

ముంబైలో హిందూస్తాన్ యూనిలివ‌ర్ చైర్మ‌న్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై మెహ‌తాతో కేటీఆర్ చర్చించారు. మూఖ్యంగా ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్( FMCG) సెక్టార్ లో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై కేటీఆర్, మెహతా చర్చలు జరిపారు.

ముంబైలో హిందూస్తాన్ యూనిలివ‌ర్ చైర్మ‌న్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
X

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముంబై పర్యటన‌లో ఉన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు సాగుతున్న ఈ పర్యటన‌లో భాగంగా ఈ రోజు ఆయన హిందూస్తాన్ యూనిలివ‌ర్ చైర్మ‌న్ సంజీవ్ మెహ‌తాతో సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై మెహ‌తాతో కేటీఆర్ చర్చించారు. మూఖ్యంగా ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్( FMCG) సెక్టార్ లో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై కేటీఆర్, మెహతా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్ కూడా పాల్గొన్నారు.

Advertisement

Next Story