Telugu Global
Telangana

కేటీఆర్ డిజిటల్ ఛాలెంజెస్..

స్పామ్ మెసేజ్ ల కారణంగా ఈ నెంబర్ తో వాట్సప్ వాడటం ప్రస్తుతం కుదరదని, కొత్త నెంబర్ తో ట్రై చేయండని.. వాట్సప్ నుంచి వచ్చిన మెసేజ్ ని కూడా స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్.

కేటీఆర్ డిజిటల్ ఛాలెంజెస్..
X

ఐటీ మంత్రికి డిజిటల్ ఛాలెంజెస్ ఏంటని అనుకుంటున్నారా..? ఇది స్వయంగా కేటీఆరే తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన మేటర్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ మంగళవారం ఫైల్స్ చూస్తున్న ఓ ఫొటో పోస్ట్ చేసిన కాసేపటికే.. తాను డిజిటల్ ఛాలెంజెస్ ఎదుర్కొన్నానంటూ మరో ట్వీట్ చేశారు కేటీఆర్. తన వాట్సప్ క్రాష్ అయిపోయిందని ఒకేరోజు 8వేల మెసేజ్ లతో వాట్సప్ నిండిపోయిందని చెప్పారు.


పుట్టినరోజుకి మెసేజ్ ల వెల్లువ..

కేటీఆర్ పుట్టినరోజుకి సోషల్ మీడియాలో మెసేజ్ లు వెల్లువెత్తాయి. ప్రతి మెసేజ్ కి ఆయన ప్రత్యేకంగా రిప్లై ఇస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. అలాగే వాట్సప్ లో కూడా ఆయన మొబైల్ నెంబర్ కి వేలాది మెసేజ్ లు వచ్చాయి. దాదాపు 8వేల మెసేజ్ లు వచ్చాయి. వ్యక్తిగతంగా అన్నిటికీ రిప్లై ఇవ్వాలని కేటీఆర్ భావించడంతో వాట్సప్ క్రాష్ అయింది. "Got kicked out of my @WhatsApp" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. డిజిటల్ ఛాలెంజెస్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు. స్పామ్ మెసేజ్ ల కారణంగా ఈ నెంబర్ తో వాట్సప్ వాడటం ప్రస్తుతం కుదరదని, కొత్త నెంబర్ తో ట్రై చేయండని.. వాట్సప్ నుంచి వచ్చిన మెసేజ్ ని కూడా స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్.


ఓవైపు పని, మరోవైపు పరామర్శ..

ఓవైపు తన శాఖకు సంబంధించిన ఫైళ్లతో కుస్తీ పడుతున్న కేటీఆర్, మరోవైపు సోషల్ మీడియాలో సాయంకోసం తనవద్దకు వచ్చిన అభ్యర్థనలపై కూడా అంతే త్వరగా రియాక్ట్ అవుతున్నారు. బస్వరాజు ప్రశాంత్ అనే 29ఏళ్ల వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, నిరుపేద కుటుంబం తల్లడిల్లుతోందని, ఆస్పత్రి ఖర్చులు చేయిదాటిపోతున్నాయంటూ బాధితుడు, అతడి మెడికల్ బిల్స్ ని ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసి, కేటీఆర్ ని ట్యాగ్ చేశారు. దీనిపై వెంటనే స్పందించారు మంత్రి కేటీఆర్. తన టీమ్ అతని కుటుంబానికి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

First Published:  27 July 2022 1:26 AM GMT
Next Story