Telugu Global
Telangana

నేడు కిటెక్స్‌, సింటెక్స్ యూనిట్లకు కేటీఆర్‌ శంకుస్థాపన.. 11,650 మందికి ఉద్యోగాలు

రెండో యూనిట్‌ను 250 ఎకరాల్లో రూ.1,200 కోట్ల వ్యయంతో షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నేడు ఈ యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

నేడు కిటెక్స్‌, సింటెక్స్ యూనిట్లకు కేటీఆర్‌ శంకుస్థాపన.. 11,650 మందికి ఉద్యోగాలు
X

తెలంగాణలో తమ యూనిట్లను నెలకొల్పేందుకు రెండు దిగ్గజ కంపెనీలు రెడీ అయ్యాయి. రూ.1,472 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీలకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఇవాళ శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

దుస్తుల తయారీలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన కిటెక్స్ గ్రూప్‌ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు రెండో యూనిట్‌ను 250 ఎకరాల్లో రూ.1,200 కోట్ల వ్యయంతో షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నేడు ఈ యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా ఏకంగా 11వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇందులో 80 శాతం ఉద్యోగాలను మహిళలకే ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.


ఇక సింటెక్స్ సంస్థ ఇప్పటికే షాబాద్‌ మండలంలోని చందనవెల్లిలో వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్. వెన్‌స్పన్ అడ్వాన్స్‌డ్ మెటిరీయల్స్ పేరిట రెండు యూనిట్లను నెలకొల్పగా.. ప్రస్తుతం రూ.272 కోట్లతో మూడో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ ద్వారా మరో 650 మందికి ఉద్యోగావకాశాలను సంస్థ కల్పించనుంది.

First Published:  28 Sep 2023 3:55 AM GMT
Next Story