Telugu Global
Telangana

వీఎక్స్ఐ గ్లోబల్.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఐదేళ్లలో 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం చెప్పింది. ఐదేళ్ల కంటే ముందుగానే 10 వేల మందికి ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు.

వీఎక్స్ఐ గ్లోబల్.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
X

వీఎక్స్ఐ గ్లోబల్ సంస్థ దేశంలో తొలి సారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వీఎక్స్ఐ సంస్థ హైదరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐదేళ్లలో 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం చెప్పింది. ఐదేళ్ల కంటే ముందుగానే 10 వేల మందికి ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌కు దేశం నలుమూలల నుంచి ఎంతో మంది గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్ వస్తున్నారు. ఈ నగరం టాలెంట్‌తో కూడిన యువతతో నిండి ఉంది.ఇది చాలా అందమైన నగరం. ఎవరికైనా ఇక్కడ ఉంటే సొంత నగరంలో ఉన్నట్లే ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి నగరాన్ని తమ కార్యకలాపాల కోసం వీఎక్స్ఐ గ్లోబల్ ఎంచుకోవడాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. మీరు గ్లోబల్ కంపెనీ అయినా.. లోకల్ ట్రెడిషన్స్ ఫాలో అవుతుండటం సంతోషంగా ఉందని యాజమాన్యాన్ని ప్రశంసించారు. వీఎక్స్ఐ గ్లోబల్ కంపెనీ తమ కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగించాలని కేటీఆర్ కోరారు.

కాగా, ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించిన సందర్భంలో బైన్ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ బోగర్ కింగ్‌తో భేటీ అయ్యారు. అప్పుడే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వంతో వీఎక్స్ఐ గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకున్నది. బైన్ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ సంస్థ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సొల్యూషన్స్‌లో మంచి అనుభవం కలిగి ఉన్నది.

ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, ఆసియా, యూరోప్, కరేబియన్ ప్రాంతాల్లో విస్తరించిన వీఎక్స్ఐ గ్లోబల్.. తాజాగా హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించింది.


First Published:  2 Aug 2023 8:06 AM GMT
Next Story