Telugu Global
Telangana

అన్నదమ్ములిద్దరూ కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు - కేటీఆర్

బీజేపీపై, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ద్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్ర‌జ‌లను అంగ‌డి స‌రుకులా కొంటాన‌ని న‌రేంద్ర మోడీ, రాజ్ గోపాల్ రెడ్డిలు ప్రదర్శించిన అహంకారానికి, మునుగోడు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌నే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

అన్నదమ్ములిద్దరూ కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు - కేటీఆర్
X

మునుగోడు ఉపఎన్నిక ఒక కాంట్రాక్టర్ అహంకారం కారణంగానే వచ్చింది కానీ ప్రజల కోసం కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆరెస్ విద్యార్థి విభాగం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, రాజ గోపాల్ రేడ్డిని లోబ‌ర్చుకుని, రూ. 500 కోట్లు ఖ‌ర్చు పెట్టి అయినా స‌రే, మునుగోడు ప్ర‌జ‌లను అంగ‌డి స‌రుకులా కొంటాన‌ని న‌రేంద్ర మోడీ ప్రదర్శించిన అహంకారానికి, మునుగోడు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌నే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

అన్నదమ్ములిద్దరూ కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు అని మండిపడ్డారు కేటీఆర్. ఉద్యమం సమయంలో ఈ బఫూన్ గాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అడ్రస్ లేని లవంగం గాళ్లంతా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, వైఎస్సారే బెటర్ అని... ఇప్పుడు బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోంది, పిచ్చోళ్లతో పోరాడాల్సి వస్తోందని అన్నారు.

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను క‌ట్టబెట్టిన మాదిరిగానే.. మా న‌ల్ల‌గొండ జిల్లా అభివృద్ధికి కూడా రూ. 18 వేల కోట్ల నిధులు ఇవ్వండి.. పోటీ నుంచి త‌ప్పుకుంటామ‌ని ,ఈ విష‌యంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి నిన్న చేసిన మాట‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా క‌ట్టుబ‌డి ఉంటాన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

గుజరాత్‌ వాళ్లు తెలంగాణ కు వచ్చి రాజకీయం చేస్తే తప్పులేదుకానీ, టీఆర్ఎస్, బీఆర్‌ఎస్ గా మారితే తప్పొచ్చిందా అని ప్రశ్నించిన కేటీఆర్ తెలంగాణ బిడ్డ దేశ రాజకీయాలు చేయొద్దా అని అడిగారు.మన పార్టీ జెండా, గుర్తు మారదని... ఎవరూ గందరగోళ‌ పడాల్సిన అవసరం లేద‌ని అన్నారు. ఈడీ, బోడీలతో మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు.

First Published:  11 Oct 2022 10:32 AM GMT
Next Story