Telugu Global
Telangana

ఆ యువతి ర్యాప్ సాంగ్‌కు మంత్రి కేటీఆర్ ఫిదా

మిర్చి ఆర్జే స్వాతి షేర్ చేసిన పాట హైదరాబాదీ స్టైల్‌లో గమ్మత్తుగా సాగుతుంది.

ఆ యువతి ర్యాప్ సాంగ్‌కు మంత్రి కేటీఆర్ ఫిదా
X

ఐటీ మినిస్టర్ కేటీఆర్ అంటే యువతలో మంచి క్రేజ్ ఉంది. ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ను హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పాత్రను ఎవరూ తగ్గించలేరు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో అనేక కొత్త పెట్టుబడులకు కేటీఆర్ కారణమయ్యారు. దీంతో కేటీఆర్‌ను పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అభిమానిస్తుంటారు. ఈ క్రమంలో ఒక యువతి హైదరాబాద్ అభివృద్ధిని, తెలంగాణ సంస్కృతిని, కేటీఆర్ కృషిని పేర్కొంటూ ఒక ర్యాప్ సాంగ్ పాడింది. స్వయంగా కేటీఆర్ ఎదుటే ఈ పాట పాడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో షేర్ చేశారు.

మిర్చి ఆర్జే స్వాతి షేర్ చేసిన పాట హైదరాబాదీ స్టైల్‌లో గమ్మత్తుగా సాగుతుంది. బిర్యానీ తింటూనే ఇరానీ ఛాయ్ అంటాం.. అంబేద్కర్ విగ్రహానికి సెల్యూట్ కొడతాం.. ఐటీలో అయినా అభివృద్ధిలో అయినే మనే టాప్ అంటూ సాగుతుంది ఈ పాట. చివరల్లో కేటీఆర్‌ను ప్రశంసిస్తూ మరో లైన్ కూడా పాడింది. ఆసాంతం ఈ పాట విన్న కేటీఆర్ అక్కడే ఆ యువతిని మెచ్చకున్నారు.

అదే వీడియోను షేర్ చేస్తూ ఎంత బాగుందో కదా ఈ పాట అంటూ ప్రశంసించారు. నెటిజన్లు కూడా ఆ వీడియోకు స్పందిస్తున్నారు. కిరాక్ ర్యాప్ అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది మన తెలంగాణ యాస అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఇప్పుడీ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


First Published:  3 Nov 2023 6:50 AM GMT
Next Story