Telugu Global
Telangana

కేటీఆర్ మామ మృతి...నివాళులు అర్పించిన‌ సీఎం కేసీఆర్

పాకాల హరినాథరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు.

కేటీఆర్ మామ మృతి...నివాళులు అర్పించిన‌ సీఎం కేసీఆర్
X

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ గారైన పాకాల హరినాథరావు గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. హరినాథరావు కు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి తరలించారు. కాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం పాకాల హరినాథరావు మృతి చెందారు.

కాగా పాకాల హరినాథరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. కేసీఆర్ తన కోడలు శైలిమను కేసీఆర్ ఓదార్చారు. అలాగే హరినాథరావు కుటుంబసభ్యులను కేసీఆర్ దంపతులు ఓదార్చారు.

First Published:  29 Dec 2022 12:25 PM GMT
Next Story