Telugu Global
Telangana

చెత్తనుంచి సంపద సృష్టిలో ఆదర్శంగా హైదరాబాద్

చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సామర్థ్యం త్వరలో సెంచరీ దాటేస్తుందంటున్నారు మంత్రి కేటీఆర్. 2024 డిసెంబర్ నాటికి 101 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

చెత్తనుంచి సంపద సృష్టిలో ఆదర్శంగా హైదరాబాద్
X

వెల్త్ ఔట్ ఆఫ్ వేస్ట్ (WOW)లో హైదరాబాద్ నిజంగానే వావ్ అనిపిస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా చెత్త సమస్య పరిష్కరించడంతోపాటు, సంపద సృష్టి కూడా సాధ్యమవుతుంది. తాజాగా దుండిగల్ వద్ద నిర్మించిన 14.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

వ్యర్థాలనుంచి సంపద సృష్టించడం గురించి చాలామంది కబుర్లు చెబుతుంటారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ మాటల్ని ఆచరణలో పెట్టింది. చెత్తనుంచి సంపద సృష్టించడాన్ని అమలులో చూపిస్తోంది. దీనికి తాజా ఉదాహరణే జవహర్ నగర్ లోని 20మెగావాట్ల ప్లాంట్. ఇక్కడకు తీసుకొచ్చే చెత్తతో 20మెగా వాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. దీనికి తోడు ఇప్పుడు దుండిగల్ వద్ద GHMC ఆధ్వర్యంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 14.5 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. మొత్తంగా ఈ రెండు ప్లాంట్లనుంచి 34.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.


త్వరలో 100 మెగావాట్లు..

చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సామర్థ్యం త్వరలో సెంచరీ దాటేస్తుందంటున్నారు మంత్రి కేటీఆర్. 2024 డిసెంబర్ నాటికి 101 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. త్వరలో హైదరాబాద్ లో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అదే సమయంలో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని కూడా పెంచుతారు. చెత్త సమస్య తీరిపోవడంతోపాటు, హైదరాబాద్ అవసరాలకు తగిన విద్యుత్ ని కూడా ఇక్కడినుంచే ఉత్పత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది.

First Published:  15 July 2023 7:10 AM GMT
Next Story