Telugu Global
Telangana

నేను డాక్టర్ కావాలనేది మా అమ్మ కోరిక –కేటీఆర్

వైద్య వృత్తిలో మహిళలు రాణిస్తున్నారని, కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో కూడా మహిళల పాత్ర కీలకంగా ఉందని అన్నారు మంత్రి కేటీఆర్.

నేను డాక్టర్ కావాలనేది మా అమ్మ కోరిక –కేటీఆర్
X

వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైందని అన్నారు మంత్రి కేటీఆర్. "తమ పిల్లల్లో ఒక్కరైనా డాక్టర్ కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. మా ఇంట్లో నేను డాక్టర్ కావాలనేది మా అమ్మ కోర్కె" అని చెప్పారాయన. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్ ఇన్ మెడికల్ కాంక్లేవ్' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. తనను డాక్టర్ గా చూడాలనేది తన తల్లి కోర్కె అని చెప్పారు.

తెలంగాణలో జెండర్ ఈక్వాలిటీ భేష్..

ఇండియాలో జెండర్ ఇక్వాలిటీని పాటించే కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలిపారు మంత్రి కేటీఆర్. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి వీ-హబ్‌ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో మహిళ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వైద్య వృత్తిలో మహిళలు రాణిస్తున్నారని, కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో కూడా మహిళల పాత్ర కీలకంగా ఉందని అన్నారు కేటీఆర్. కొత్త టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని గుర్తు చేశారు.


భారత్ లో కొన్నేళ్లుగా వైద్యరంగం ఎంతో పురోగతి సాధిస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. వైద్యులు తమ డ్యూటీకి మొదటి ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తారన్నారు. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ ఉన్నా అటెండ్‌ అవుతారని తెలిపారు. కొవిడ్ సమయంలో అందరికీ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సమయంలో ఏఐజీ ఆస్పత్రి మంచి సేవలు అందించిందని కొనియాడారు. కొవిడ్ సమయంలో అందరికి అందుబాటులో ఉన్న ధరలతో సేవలు అందించారని తెలిపారు. కమర్షియల్, ప్రాఫిట్ కోసం కాకుండా రీసెర్చ్ కోసం అందరికి అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో ఏఐజీ ప్రారంభించారని చెప్పారు కేటీఆర్. వైద్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

First Published:  3 Dec 2022 10:41 AM GMT
Next Story