Telugu Global
Telangana

నువ్వు దేవా - నేను వరదా.. కోమటిరెడ్డి కొత్త పోస్టు వైరల్

కోమటిరెడ్డి లేటెస్ట్‌ పోస్టు మీద కూడా BRS నుంచి విమర్శలు పేలుతున్నాయి. నిన్నటి డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికి ఇవాళ ఇలా కవర్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు.

నువ్వు దేవా - నేను వరదా.. కోమటిరెడ్డి కొత్త పోస్టు వైరల్
X

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పెడుతున్న పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిన్న భట్టి, ఇవాళ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్న ఫొటోను షేర్ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై BRS నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అప్పుడే గ్రూప్ పాలిటిక్స్‌ మొదలయ్యాయా అంటూ కౌంటర్లు వేశారు.

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న ఫొటోలతో మరో వీడియోను వదిలారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. దీనికి సలార్‌ సినిమాలోని "వేగమొకడు… త్యాగమొకడు గతము మరువని గమనమే" సాంగ్‌ను యాడ్‌ చేశారు. పాటలోని కొన్నిలైన్లను పోస్టులో కోట్ చేశారు. BRSకు కౌంటర్ ఇచ్చేందుకే కోమటిరెడ్డి తాజాగా ఈ పోస్టు పెట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. తాను కొందరి వాడిని కాదు, అందరి వాడినని చెప్పుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న ఫొటోలను షేర్ చేశారన్న చర్చ నడుస్తోంది.


కోమటిరెడ్డి లేటెస్ట్‌ పోస్టు మీద కూడా BRS నుంచి విమర్శలు పేలుతున్నాయి. నిన్నటి డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికి ఇవాళ ఇలా కవర్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. కోమటిరెడ్డి పోస్టులపై కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. మీరు ఇలాగే ఎప్పుడూ కలిసి ఉండాలని పోస్టులు పెడుతున్నారు.

First Published:  31 Dec 2023 9:01 AM GMT
Next Story