Telugu Global
Telangana

ఆరు గ్యారెంటీలు అవి కావు.. ఇవి

వారంటీ ముగిసిన కాంగ్రెస్ పార్టీ హామీలకు గ్యారంటీ ఎవరు? అని ప్రశ్నించారు హరీష్ రావు. నమ్మి ఓటేసిన కర్నాటక ప్రజలను ఆల్రడీ కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని విమర్శించారు.

ఆరు గ్యారెంటీలు అవి కావు.. ఇవి
X

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై అదిరిపోయే సెటైర్ పేల్చారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అవి కావు, ఇవి అని చెప్పారు.

కాంగ్రెస్ అంటే అవినీతికి గ్యారంటీ..

కాంగ్రెస్ అంటే కుమ్ములాటకు గ్యారంటీ..

కాంగ్రెస్ అంటే పేదరికానికి గ్యారంటీ..

కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలకు గ్యారంటీ..

కాంగ్రెస్ అంటే స్కాంలకు గ్యారంటీ..

కాంగ్రెస్ అంటే రైతు ఆత్మహత్యలకు గ్యారంటీ..

అంటూ ఆ ఆరు గ్యారెంటీలకు సరికొత్త అర్థం చెప్పారు హరీష్ రావు.


కాంగ్రెస్ హయాంలో అవినీతి తారాస్థాయిలో జరిగిందని, సీఎం కుర్చీ కోసం కుమ్ములాటతోనే నాయకులకు సరిపోతుందని, పాలన గాలికొదిలేస్తారు కాబట్టి రాష్ట్రంలో పేదరికం తాండవిస్తుందని, కరెంటు నిర్వహణ సమర్థంగా ఉండదు కాబట్టి కోతలుంటాయని, స్కామ్ లు తప్పనిసరి అని, రైతులను పట్టించుకోరు, గిట్టుబాటు ధరలు ఉండవు కాబట్టి రైతు ఆత్మహత్యలు గ్యారెంటీ అని చెప్పారు హరీష్ రావు.

వారంటీ ముగిసిన కాంగ్రెస్ పార్టీ హామీలకు గ్యారంటీ ఎవరు? అని ప్రశ్నించారు హరీష్ రావు. నమ్మి ఓటేసిన కర్నాటక ప్రజలను ఆల్రడీ కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని విమర్శించారు. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో.. సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటే అంత భద్రంగా ఉంటుందన్నారు హరీష్ రావు.

First Published:  15 Nov 2023 4:39 PM GMT
Next Story