Telugu Global
Telangana

నియోజకవర్గానికో డయాలసిస్‌ సెంటర్‌- హరీశ్‌ రావు

నిమ్స్‌ను 4 వేల పడకలకు పెంచుకున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. పీజీ వైద్య సీట్లలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివ‌రించారు.

నియోజకవర్గానికో డయాలసిస్‌ సెంటర్‌- హరీశ్‌ రావు
X

తెలంగాణలో త్వరలోనే నియోజకవర్గానికో డయాలసిస్‌ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీష్‌ రావు. 2014కు ముందు రాష్ట్రంలో మూడు డయాలసిస్‌ సెంటర్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడవి 82కి చేరాయన్నారు. రవీంద్రభారతిలో వైద్య, ఆరోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి విడుదల చేశారు. పదేళ్లలో హెల్త్ సెక్టార్‌లో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు.


రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5 ఐసీయూలు మాత్రమే ఉంటే.. ప్రస్తుతం అవి 80కి చేరాయన్నారు హరీశ్‌ రావు. ఇక మాతాశిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించామన్నారు. రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లను 450కి పెంచామన్నారు. 300 అమ్మ ఒడి వాహనాలును తీసుకువ‌చ్చామ‌ని మంత్రి హరీశ్ రావు వివ‌రించారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతంగా ఉంటే.. ఇవాళ 76 శాతానికి పెరిగాయన్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల్లో తెలంగాణ ముందుందన్నారు హరీశ్‌ రావు.

నిమ్స్‌ను 4 వేల పడకలకు పెంచుకున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. పీజీ వైద్య సీట్లలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివ‌రించారు. వైద్యం పరంగా నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. మందులు లేవు, ప్రైవేటులో కొనుక్కోండి అని చెప్పే పరిస్థితి ఇవాళ లేదన్న హరీశ్‌ రావు.. ఇది పేదలపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.

First Published:  25 Sep 2023 10:01 AM GMT
Next Story