Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ పుణ్యమా అని నీళ్ల బాధ తీరింది : మంత్రి హరీశ్ రావు

తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, కర్ణాటకలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు. కానీ తెలంగాణలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు.

KCR: సీఎం కేసీఆర్ పుణ్యమా అని నీళ్ల బాధ తీరింది : మంత్రి హరీశ్ రావు
X

సీఎం కేసీఆర్ పుణ్యమా అని నీళ్ల బాధ తీరింది : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంత ప్రజలు, రైతులు నీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ పుణ్యమా అని ఇంటింటికీ మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తాగు, సాగు నీరు పుష్కలంగా వస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణకు నీటి సమస్య తీరిందని మంత్రి చెప్పారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలో మంత్రి పర్యటించారు.

నియోజకవర్గంలోని పలు గ్రామ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, కర్ణాటకలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు. కానీ తెలంగాణలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్ ప్రాంతాల్లో ప్రజలకు తాగు నీరు ఆరు రోజులకు ఒక సారి మాత్రమే వస్తున్నదని అన్నారు. అక్కడ నల్లాల్లో నీటి కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. కేసీఆర్ పుణ్యాన తెలంగాణలో తాగు నీటికి సమస్య లేకుండా పోయిందన్నారు.

దేశంలోని 16 రాష్ట్రాల్లోని బీడీ కార్మికులకు అక్కడి ప్రభుత్వాలు రూపాయి కూడా ఇవ్వడం లేదు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని మంత్రి చెప్పారు. బీజేపీది డబుల్ ఇంజన్ సర్కారు కాదని.. అదొక ఆయిల్ ఇంజన్ సర్కారని ఎద్దేవా చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వ్యవసాయానికి విద్యుత్‌ను సరఫరా చేయలేక పోతున్నారని అన్నారు. అక్కడ 20 లక్షల ఆయల్ ఇంజన్లు నడుస్తున్నాయని హరీశ్ రావు విమర్శించారు.

ఇప్పుడు మండుటెండల్లో సైతం జిల్లాలోని నక్కవాగు చెరువు నిండే ఉన్నదని గుర్తు చేశారు. మాటిండ్లకు రావాలంటే వానలు పడ్డప్పుడు దారి ఉండేది కాదు. ఇప్పుడు ఆ బాధ కూడా తీరిపోయిందన్నారు. నక్కవాగు పక్కన చెరువులో, మాటిండ్లలో 35 బోర్లు వేసినా అప్పట్లో చుక్క నీరు పడలేదని గుర్తు చేశారు. ప్రజలు పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని.. మరింత అభివృద్ధి చేసుకునేందుకు గాను ప్రజలందరూ తగిన సహకారాన్ని అందించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

Next Story