Telugu Global
Telangana

కాంగ్రెస్ డిక్లరేషన్ పై హరీష్ రావు హాట్ కామెంట్స్

కర్నాటకలో డిక్లరేషన్లు అమలు చేసి, ఆ తర్వాత తెలంగాణకు రావాలని ఖర్గేకి సూచించారు హరీష్ రావు. కర్నాటక, ఛత్తీస్‌ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా.. అక్కడ ఈ పథకాలన్నీ ఎందుకు అమలులో లేవని ప్రశ్నించారు.

కాంగ్రెస్ డిక్లరేషన్ పై హరీష్ రావు హాట్ కామెంట్స్
X

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ పై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వి తప్పుడు డిక్లరేషన్లు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఆ పార్టీ గెలిచేది లేదని, డిక్లరేషన్లు అమలు చేసేది లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చే మొహం అయితే ముందు కర్నాటకలో ఆ డిక్లరేషన్లన్నీ అమలు చేయాలని సవాల్ విసిరారు.

కర్నాటకలో కాంగ్రెస్ వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తోందని, తెలంగాణలో సీఎం కేసీఆర్ వికలాంగులకు 4,116 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని గుర్తు చేశారు హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేది లేదు, ఇచ్చేది లేదని.. అందుకే నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నారని, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేస్తున్నారని చెప్పారు. కర్నాటకలో డిక్లరేషన్లు అమలు చేసి, ఆ తర్వాత తెలంగాణకు రావాలని ఖర్గేకి సూచించారు హరీష్ రావు. కర్నాటక, ఛత్తీస్‌ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా.. అక్కడ ఈ పథకాలన్నీ ఎందుకు అమలులో లేవని ప్రశ్నించారు.

మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శ లు..

కాంగ్రెస్ పార్టీ తప్పుడు డిక్లరేషన్లను ప్రజలు ఎప్పటికీ నమ్మబోరని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. దేశవ్యాప్తంగా ఇలాంటి డిక్లరేషన్లు ప్రకటించే దమ్ము కాంగ్రెస్ కి ఉందా? అని ప్రశ్నించారామె. తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తుందన్నారు. ఇంకా బుద్ధి, సోయి రాలేదా..? అన్నారు. 10 మంది నాయకులు కలిసి తిరిగే పరిస్థితి కాంగ్రెస్‌లో ఉందా..? అని నిలదీశారు సత్యవతి రాథోడ్.


First Published:  27 Aug 2023 9:04 AM GMT
Next Story