Telugu Global
Telangana

వచ్చే ఏడాది మిగిలిన 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు.. పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు

2024లో ప్రారంభించేకోనున్న 8 కాలేజీలతో సీఎం కేసీఆర్ సంకల్పం పూర్తవుతుందని మంత్రి చెప్పారు.

వచ్చే ఏడాది మిగిలిన 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు.. పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
X

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో కొత్తగా 8 కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. కొత్త కాలేజీలు అన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించనున్నాయి. మిగిలిన 8 కాలేజీలకు సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

2024లో ప్రారంభించేకోనున్న 8 కాలేజీలతో సీఎం కేసీఆర్ సంకల్పం పూర్తవుతుందని మంత్రి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కొత్త మెడికల్ కాలేజీల పనుల స్థితిగతులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. కొత్త కాలేజీలు వచ్చే ఏడాది ప్రారంభించడానికి అవసరమైన ప్రతిపాదనలు, అవసరమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులకు సంబంధించిన భూసేకరణ, ఇతర పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం కాలేజీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో 3 కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేశాయి. అరవై ఏళ్లలో మనకు దక్కింది అదే. కానీ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్లలోనే 21 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. అతి తక్కువ సమయంలోనే 21 కాలేజీలు ప్రారంభించి దేశంలోనే రికార్డు సృష్టించామని మంత్రి చెప్పారు.

కొత్త కాలేజీలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం నడిచేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌లపై ఉందని అన్నారు. తరగతుల నిర్వహణ, అనుమతుల రెన్యూవల్ వంటి విషయాల్లో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. విద్యార్థులకు, టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్‌కు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి హరీశ్ సూచించారు.

First Published:  16 Jun 2023 3:58 PM GMT
Next Story