Telugu Global
Telangana

సంగారెడ్డి పంచాయితీ తేల్చేసిన మంత్రి హరీష్ రావు

ఓ దశలో పట్నం మాణిక్యం ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తానన్నారు. కానీ హరీష్ రాకతో ఆయన బెట్టువీడారు. పార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. చింతాతో కలసి పనిచేస్తానన్నారు.

సంగారెడ్డి పంచాయితీ తేల్చేసిన మంత్రి హరీష్ రావు
X

సంగారెడ్డిలో అసంతృప్తి పంచాయితీకి ఫుల్ స్టాప్ పెట్టారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో పార్టీపై గుర్రుగా ఉన్న డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఇంటికి వెళ్లారు. ఆయనతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ తో కలసి పనిచేసేందుకు ఒప్పించారు. దీంతో వ్యవహారం సద్దుమణిగింది. ఓ దశలో పట్నం మాణిక్యం ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తానన్నారు. కానీ హరీష్ రాకతో ఆయన బెట్టువీడారు. పార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. చింతాతో కలసి పనిచేస్తానన్నారు.

తెలంగాణ పాలపిట్ట..

తెలంగాణ పాలపిట్ట సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ పోరులో.. రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ ఓ వైపు ఉన్నారని, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారని.. ప్రజలు ఏవైపో తేల్చుకోవాలని చెప్పారు. ఓటుకు నోటు - నోటుకు సీటు అనే వాళ్లు, ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వాళ్లు.. తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.

కర్నాటక రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారని, అక్కడి ప్రభుత్వాన్ని తిడుతున్నారని.. తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. దేశంలో కరెంటు కోతలు ఉంటే మనం నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని గుర్తు చేశారు. ధరణి వద్దంటున్న కాంగ్రెస్.. పటేల్ పట్వారీ వ్యవస్థను తిరిగి తీసుకొస్తుందా అని ప్రశ్నించారు. ధరణిలో లోపాలు ఉంటే సరి చేస్తామని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఈ సారి భారీ మెజార్టీ రావాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు హరీష్ రావు. పట్నం సహా ప్రతి ఒక్కర్నీ పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందన్నారు.

First Published:  24 Oct 2023 10:19 AM GMT
Next Story