Telugu Global
Telangana

రైతులకు మరో గుడ్‌ న్యూస్‌.. హరీష్‌ రావు కీలక ప్రకటన

శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన హరీష్‌ రావు.. ఇప్పటివరకూ 30 లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందన్నారు.

రైతులకు మరో గుడ్‌ న్యూస్‌.. హరీష్‌ రావు కీలక ప్రకటన
X

రైతులకు మరో గుడ్‌ న్యూస్‌.. హరీష్‌ రావు కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు మంత్రి హరీష్‌ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేశామని, త్వరలోనే లక్ష రూపాయలకు పైగా ఉన్న రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అకౌంట్ పని చేయకుంటే.. వారి అకౌంట్ ఆపరేషనలైజ్ చేసి మాఫీ జరిగేలా చూస్తామన్నారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన హరీష్‌ రావు.. ఇప్పటివరకూ 30 లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందన్నారు.

బీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ నేతలు బేజారవుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టేందుకు ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారన్నారు. బీజేపీ క్యాడర్‌ కోసం వెతుకుతోందని ఎద్దేవా చేశారు.

2018 ఎన్నికలకు ముందు..లక్ష రూపాయలలోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 14 నాటికి లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసి.. రైతులకు ఇండిపెండెన్స్‌ డే కానుకను అందించారు కేసీఆర్. రైతు రుణాల మాఫీ కోసం ప్రభుత్వం 5 వేల 809 కోట్ల రూపాయలను బ్యాంకులకు విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 9 లక్షల 2 వేల 843 మంది రైతులు రుణ విముక్తులయ్యారు.

First Published:  19 Aug 2023 2:41 PM GMT
Next Story