Telugu Global
Telangana

వీధుల్లో న‌డుస్తూ.. చెత్త ఏరుతూ.. - మంత్రి హ‌రీశ్‌రావు స్ఫూర్తిదాయ‌క ప్ర‌చారం

మంత్రి హ‌రీశ్‌రావు వీధుల్లో న‌డుస్తూ.. స్వ‌యంగా తానే చెత్త ఏర‌డం. ఇందులో భాగంగా మురుగు కాల్వల్లోని ప్లాస్టిక్ వస్తువులను మంత్రి స్వయంగా తొలగించారు.

వీధుల్లో న‌డుస్తూ.. చెత్త ఏరుతూ.. - మంత్రి హ‌రీశ్‌రావు స్ఫూర్తిదాయ‌క ప్ర‌చారం
X

సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హ‌రీశ్‌రావు సోమ‌వారం సిద్ధిపేట ప‌ట్ట‌ణంలో స్ఫూర్తిదాయ‌క కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. జిల్లాలో నిర్వహించిన 'నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం' కార్యక్రమంలో మంత్రి హ‌రీశ్‌ పాల్గొన్నారు. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని సాధించవచ్చంటూ సిద్దిపేట మున్సిపాలిటీ ఈ కార్య‌క్ర‌మానికి చేప‌ట్టింది.



ఇందులో విశేష‌మేమిటంటే.. మున్సిప‌ల్ అధికారులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు వీధుల్లో న‌డుస్తూ.. స్వ‌యంగా తానే చెత్త ఏర‌డం. ఇందులో భాగంగా మురుగు కాల్వల్లోని ప్లాస్టిక్ వస్తువులను మంత్రి స్వయంగా తొలగించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రజలు పాటించాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కోరారు.




ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా 'మన చెత్త - మన బాధ్యత' అంటూ ప్రచారం చేసిన మంత్రి హ‌రీశ్‌రావు.. చెత్త వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. యోగా చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామని, క్రమపద్ధతిలో చేస్తే జీవితకాలం పెరుగుతుందని వివ‌రించారు. జిల్లాలోని ఓ పాఠశాలలో నిర్వహించిన ఆనంద యోగా కార్యక్రమానికి హాజరై 100 మంది సాధకులకు మ్యాట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని వార్డుల వారీగా 10 రోజులు ఉచిత యోగా శిబిరం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

First Published:  24 July 2023 8:29 AM GMT
Next Story