Telugu Global
Telangana

బీజేపీకి ఓటేసి గోస పడొద్దు : మంత్రి హరీశ్ రావు

మునుగోడు నుంచి వలస వచ్చి పట్నంలో కూలీ నాలీ చేసుకుంటున్న రైతులు సొంత ఊర్లకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి చెప్పారు.

బీజేపీకి ఓటేసి గోస పడొద్దు : మంత్రి హరీశ్ రావు
X

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి ఓటు వేసి మరోసారి మోసపోవద్దని, ఆ పార్టీకి ఓటేసి గోస పడొద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవ్వాళ ఎల్బీనగర్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో మర్రిగూడ గ్రామ ప్రజలతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ జిమ్మిక్కులు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. ఈ ఎన్నిక ప్రజా ఆత్మ గౌరవం, రాజగోపాల్ రెడ్డి ధన దాహానికి మధ్య జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధికి పెద్ద పీట వేసి.. అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

బీజేపీలో ప్రతీ ఒక్కరు ఓటములకు సాకులు వెతుక్కుంటున్నారు. పోలింగ్ డేట్ దగ్గర పడగానే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రఘునందన్, ఈటల రాజేందర్ తమకు ఆరోగ్యం బాగా లేదని చెప్పి ప్రచారంలో వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అలాగే చేయబోతున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ రాజకీయం అంటే అలాగే ఉంటదని అర్థం అవుతున్నదని మంత్రి హరీశ్ చెప్పుకొచ్చారు. ఒకరు చెయ్యి విరిగిందని, మరొకరు కాలు విరిగిందని, ఇంకొకరు ఇంకేదో జరిగిందని సానుభూతి కార్డు ప్లే చేస్తున్నారు. బీజేపీ చేసే ఇలాంటి గిమ్మిక్కులను నమ్మ వద్దని మంత్రి హెచ్చరించారు.

మునుగోడు నుంచి వలస వచ్చి ఇక్కడ కూలీ నాలీ చేసుకుంటున్న రైతులు సొంత ఊర్లకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి చెప్పారు. శివన్నగూడెం చెరువులో నీళ్లు పారించి.. ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన పథకాల కారణంగా భూమి విలువ ఎంతో పెరిగిందని మంత్రి చెప్పారు. మర్రిగూడ దిక్కే చూడని రాజగోపాల్ రెడ్డికి మళ్లీ ఓటెందుకు వెయ్యాలని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాలన్నీ దగ్గర నుంచి పరిశీలించాలని.. బీజేపీ ఓటేసి మళ్లీ గోస పడొద్దని సూచించారు.

First Published:  23 Oct 2022 3:10 PM GMT
Next Story