Telugu Global
Telangana

వైద్యం, వైద్య విద్యలో తెలంగాణ నెంబర్-1

ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యులను తయారు చేయడంలో తెలంగాణ నెంబర్‌-1 గా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఎంబీబీఎస్‌ ఫీజులు రాష్ట్రంలోనే తక్కువని, వైద్య విద్యార్థులకు అందించే స్టైఫండ్‌ అన్ని రాష్ట్రాలకంటే ఇక్కడే ఎక్కువ అని చెప్పారు.

వైద్యం, వైద్య విద్యలో తెలంగాణ నెంబర్-1
X

వైద్యం, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. గాంధీ మెడికల్‌ కాలేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఘనత అని తెలిపారు. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ సీట్లతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు మంత్రి హరీష్ రావు. లక్ష జనాభాకు 8 పీజీ సీట్లతో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు.

2014లో తెలంగాణ ప్రాంతంలో ఎంబీబీఎస్ సీట్లు - 2850

2023నాటికి ఎంబీబీఎస్‌ సీట్లు - 8,515

2014లో పీజీ మెడికల్ లో అందుబాటులో ఉన్న సీట్లు - 1183

2023నాటికి పీజీ మెడికల్ లో ఉన్న సీట్లు - 2,890

ఇదీ క్లుప్తంగా వైద్య విద్యలో తెలంగాణ సాధించిన ఘనత. దేశవ్యాప్తంగా జిల్లాకొక మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు మంత్రి హరీష్ రావు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిబంధనల ప్రకారం రాష్ట్రంలో వైద్యులు ఉన్నారని అన్నారు.


ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యులను తయారు చేయడంలో తెలంగాణ నెంబర్‌-1 గా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఎంబీబీఎస్‌ ఫీజులు రాష్ట్రంలోనే తక్కువని, వైద్య విద్యార్థులకు అందించే స్టైఫండ్‌ అన్ని రాష్ట్రాలకంటే ఇక్కడే ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు పీజీలో రిజర్వేషన్‌ సదుపాయం కల్పి స్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం నలుదిక్కుల నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌ గ్లోబల్‌ హెల్త్‌ హబ్‌ గా మారిందని, ఇతర దేశాలకు చెందినవారంతా వైద్యసేవలు, చికిత్సల కోసం హైదరాబాద్‌ కు క్యూ కడుతున్నారని తెలిపారు. త్వరలోనే గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి, ఫెర్టిలిటీ, ఎంసీహెచ్‌ భవనాలు, అధునాతన అపరేషన్‌ థియేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

First Published:  14 Aug 2023 2:34 AM GMT
Next Story