Telugu Global
Telangana

దేశానికి డాక్టర్లను తయారు చేసి ఇస్తున్నాం..

ఎంబీబీఎస్ చదువు కోసం ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు తెలంగాణకు వస్తున్నారన్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. పాత ఐదు మెడికల్ కాలేజీల్లో ఆంధ్రా విద్యార్థులకు 15 శాతం సీట్లు వస్తున్నాయని, కొత్తగా ఏర్పాటైన 26 మెడికల్ కాలేజీల్లో 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

దేశానికి డాక్టర్లను తయారు చేసి ఇస్తున్నాం..
X

ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అంటే ఒకరకంగా దేశానికి అన్నం పెడుతోంది తెలంగాణ. ప్రాణం నిలిపే ఆహారాన్నే కాదు, ప్రాణం పోసే డాక్టర్లను కూడా దేశానికి అందిస్తోంది తెలంగాణ. అవును.. దేశం మొత్తంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణ నుంచే ఉన్నాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. దేశానికే తెలంగాణ డాక్టర్లను తయారు చేసి ఇస్తోందని శాసన మండలిలో ప్రస్తావించారు.

ఎంబీబీఎస్ చదువు కోసం ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నారన్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. పాత ఐదు మెడికల్ కాలేజీల్లో ఆంధ్రా విద్యార్థులకు 15 శాతం సీట్లు వస్తున్నాయని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన 26 మెడికల్ కాలేజీల్లో 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఉస్మానియా ఆసుపత్రిని అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తామని ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని తెలిపారు హరీష్ రావు.

ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం..

కొత్తగా విధుల్లో చేరిన ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం విధించామని చెప్పారు మంత్రి హరీష్ రావు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతాయన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వైట్, పింక్, గ్రీన్, బ్లూ విప్లవాలు తీసుకొచ్చారని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల 60 ఏళ్ల పాలనలో తెలంగాణకు 2 మెడికల్ కాలేజీలు తెస్తే, కేసీఆర్ సర్కార్ తొమ్మిదేళ్లలో 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, ఇది గర్వించదగ్గ విషయం అన్నారు. దేశంలోని మొత్తం ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణ విద్యార్థులు సాధిస్తున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు.

First Published:  4 Aug 2023 10:45 AM GMT
Next Story