Telugu Global
Telangana

కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ

గ్యారెంటీ కార్డులంటూ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో హడావిడి చేస్తున్నారని, అసలు గ్యారెంటీ, వారంటీ అంటేనే కేసీఆర్ అని చెప్పారు హరీష్ రావు.

కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ
X

సీఎం కేసీఆర్ మాటిస్తే తప్పడని అన్నారు మంత్రి హరీష్ రావు. మాట తిప్పని, మడమ తిప్పని నాయకుడు ఆయనేనని చెప్పారు. గ్యారెంటీ కార్డులంటూ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో హడావిడి చేస్తున్నారని, అసలు గ్యారెంటీ, వారంటీ అంటేనే కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు తెలంగాణలో పనిచేయవన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పారు హరీష్ రావు.

హామీల అమలులో కేసీఆర్ నెంబర్-1 అన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు 71శాతం ఫిట్‌ మెంట్‌ ఇస్తోందన్నారు. త్వరలో సీఎం కొత్త పీఆర్సీ వేసి తీపికబురు చెబుతారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ వేతనాలు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌ లో ఉన్నాయని చెప్పారు. చూసేందుకు వెజ్‌ గవర్న మెంట్ అని, కానీ చేసేందుకు నాన్‌ వెజ్‌ గవర్నమెంట్‌ అంటూ బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు హరీష్ రావు.

సిద్దిపేట జిల్లాకేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. కుమ్మర మోడ్రన్‌ యాంత్రిక పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్‌ బీసీలకు చేసే ఆర్థికసాయం పథకాన్ని కాపీ కొట్టారని, అది అప్పు రూపంలో మోదీ అందిస్తున్నారని, దానికి విశ్వకర్మ యోజన అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు ఎందుకు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు.. 50ఏళ్ల పాలనలో అభివృద్ధి మరచిపోయారని, ఇప్పుడు గ్యారెంటీ కార్డులు, బాండ్ పేపర్లు ఇస్తామంటూ వస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది మాత్రం కేసీఆరేనని చెప్పారు మంత్రి హరీష్ రావు.

First Published:  27 Sep 2023 1:58 AM GMT
Next Story