Telugu Global
Telangana

ప్రజలకు బీజేపీ ఇచ్చింది ఒకటే.. అదే జీఎస్టీ

కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీడీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేశాయని పేర్కొన్నారు హరీష్ రావు. నెలనెలా పెన్షన్ ఇచ్చి సీఎం కేసీఆర్‌ వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వివరించారు.

ప్రజలకు బీజేపీ ఇచ్చింది ఒకటే.. అదే జీఎస్టీ
X

ప్రజలకు బీజేపీ ఏమైనా ఇచ్చిందంటే అది జీఎస్టీ మాత్రమేనని విమర్శించారు మంత్రి హరీష్ రావు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసిందని, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. ఆఖరికి బీడీ కట్టలపై కూడా జీఎస్టీ వేసి, కార్మికుల పొట్టకొట్టారని విమర్శించారు హరీష్. హ్యాండ్ లూమ్ బోర్డును రద్దుచేశారని, నేతన్నలు, బీడీ కార్మికుల నడ్డి విరిచారని చెప్పారు. ఆయా వర్గాలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని విమర్శించారు హరీష్ రావు.

కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీడీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేశాయని పేర్కొన్నారు హరీష్ రావు. నెలనెలా పెన్షన్ ఇచ్చి సీఎం కేసీఆర్‌ వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వివరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే బీడీ కార్మికుల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారని, సొంత పార్టీ నాయకులకే బీజేపీపై నమ్మకం లేదని, మరి ప్రజలకెలా విశ్వాసముంటుందని ప్రశ్నించారు. వారు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలేనని విమర్శించారు హరీష్ రావు.

దుబ్బాకలో బీజేపీ ఓటమి తప్పదు..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ గెలిచినా, ఉప ఎన్నికల్లో ఆ స్థానం బీజేపీ వశమైంది. ఈ సారి అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమాగా చెప్పారు మంత్రి హరీష్ రావు. ఈ సారి బీజేపీ తెలంగాణలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదని, డకౌట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఈనెల 26న సీఎం కేసీఆర్ దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.


First Published:  20 Nov 2023 7:20 AM GMT
Next Story