Telugu Global
Telangana

ఎంఐఎం లిస్ట్ రెడీ..! సిట్టింగుల్లో తప్పని మార్పులు

సిట్టింగ్‌ స్థానాల్లోని ముగ్గురు ఎమ్మెల్యేలు వయోభారం దృష్ట్యా పోటీనుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, యాకుత్‌ పుర ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి.. పోటీకి అసక్తి చూపించడంలేదు.

ఎంఐఎం లిస్ట్ రెడీ..! సిట్టింగుల్లో తప్పని మార్పులు
X

తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎం పాత్ర విలక్షణంగా ఉంటుంది. గెలిచే స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపి, మిగతా చోట్ల నామమాత్రపు పోటీకి దిగుతుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎంకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం సిట్టింగులకే అవకాశం లభించింది. కానీ ఈసారి నాలుగు చోట్ల సిట్టింగులకు అవకాశాలు రాకపోవచ్చని తెలుస్తోంది. వాటిలో రెండు స్థానాల్లో నేతల వారసులు బరిలో దిగే అవకాశముంది.

వారసులకు సీట్లు..

సిట్టింగ్‌ స్థానాల్లోని ముగ్గురు ఎమ్మెల్యేలు వయోభారం దృష్ట్యా పోటీనుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, యాకుత్‌ పుర ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి.. పోటీకి అసక్తి చూపించడంలేదు. ముంతాజ్‌ ఖాన్‌ తన కుమారుడికి ఈసారి చార్మినార్ నుంచి అవకాశం కల్పించాలని అధినేతకు విన్నవించుకున్నారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నాంపల్లి నియోజకవర్గం నుంచి జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ ను మార్చాల్సి వస్తే ఆ స్థానంలో మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ బరిలో దిగుతారు. బహదూర్‌ పుర ఎమ్మెల్యే మోజంఖాన్‌ ను వయోభారంతో తొలగిస్తే అక్కడ అక్బరుద్దీన్‌ కుమారుడు నూరుద్దీన్‌ ఒవైసీ పోటీ చేసే అవకాశం ఉంది. నూరుద్దీన్ కు చార్మినార్ లేదా యూకుత్ పుర నుంచి కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద అక్బరుద్దీన్‌ ఒవైసీ కుమారుడు, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ కుమారుడు ఈసారి ఎంఐఎం తరపున రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టు స్పష్టమైంది. మలక్‌ పేట నుంచి అహ్మద్‌ బలాల, కార్వాన్‌ నుంచి కౌసర్‌ మొయినుద్దీన్‌ యథావిధిగా అవే స్థానాలనుంచి పోటీ చేస్తారు.

కొత్తగా రెండు చోట్ల..

ఈసారి రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ పై కూడా ఎంఐఎం నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు చోట్ల బలమైన అభ్యర్థులకోసం పార్టీ వెదుకులాట ప్రారంభించింది. సిట్టింగ్ లు ఉన్న ఏడు స్థానాలతోపాటు, ఈసారి ఎలాగైనా మరో రెండు స్థానాలు అదనంగా సాధించాలని చూస్తోంది ఎంఐఎం. త్వరలో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది.

First Published:  11 Sep 2023 12:11 PM GMT
Next Story