Telugu Global
Telangana

కేసీఆర్‌ హ్యాట్రిక్‌ పక్కా.. రాజస్థాన్‌లోనూ పోటీ

రాబోయే ఎన్నికలకు MIM పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. పోటీ చేసిన ప్రతి చోటా MIM అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మూడోసారి సీఎం అయ్యేందుకు మద్దతుగా నిలుస్తామన్నారు.

కేసీఆర్‌ హ్యాట్రిక్‌ పక్కా.. రాజస్థాన్‌లోనూ పోటీ
X

తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు MIM చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ. తెలంగాణ సీఎంగా మరోసారి కేసీఆర్‌ సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో దారుస్సలాంలో అసదుద్దీన్‌ మాట్లాడారు. రాబోయే ఎన్నికలకు MIM పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. పోటీ చేసిన ప్రతి చోటా MIM అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మూడోసారి సీఎం అయ్యేందుకు మద్దతుగా నిలుస్తామన్నారు.

తెలంగాణతో పాటు రాజస్థాన్‌లోనూ పోటీ చేస్తామన్నారు. రెండు రాష్ట్రాలు వేర్వేరు సమస్యలు కలిగి ఉన్నప్పటికీ.. మైనార్టీలు సాధికారత విషయంలో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని చెప్పారు. ఇప్పటికే రాజస్థాన్‌లో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామన్నారు. మిగతా అభ్యర్థులపైనా స్థానిక నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

MIM బీజేపీ-B టీం అన్న కాంగ్రెస్‌ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అసదుద్దీన్. 2008లో కాంగ్రెస్‌ పార్టీకి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ.. MIM మద్ద‌తుగా నిలిచింద‌ని గుర్తుచేశారు. ఈ విమర్శలు కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ ఫేక్‌ సెక్యూలర్ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు అసదుద్దీన్‌ ఓవైసీ.

First Published:  9 Oct 2023 11:18 AM GMT
Next Story