Telugu Global
Telangana

మెడికో ప్రీతి ఆత్మ‌హత్య కేసు : HOD పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం

నిందితుడు సైఫ్ ప్రీతిపై వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసినప్పటికీ నాగార్జున రెడ్డి సైఫ్ పై కఠిన చర్యలు తీసుకోకుండా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేయడంపై ప్రభుత్వ అసంత్రుప్తి వ్యక్తం చేసింది. కౌన్సిలింగ్ ఇచ్చిన మర్నాడే ప్రీతి ఆత్మహత్య చేసుకుంది.

మెడికో ప్రీతి ఆత్మ‌హత్య కేసు : HOD పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం
X

వరంగల్ మెడికో ప్రీతి ఆత్మ హత్య విషయంలో ప్రభుత్వం అనెస్థిషియా డిపార్ట్ మెంట్ హెడ్ నాగార్జునరెడ్డిపై చర్యలు తీసుకుంది. ఆయనను భూపాలపల్లికి బదిలీ చేసింది ప్రభుత్వం.

నిందితుడు సైఫ్ ప్రీతిపై వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసినప్పటికీ నాగార్జున రెడ్డి సైఫ్ పై కఠిన చర్యలు తీసుకోకుండా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేయడంపై ప్రభుత్వ అసంత్రుప్తి వ్యక్తం చేసింది. కౌన్సిలింగ్ ఇచ్చిన మర్నాడే ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ఒక వేళ నాగార్జున రెడ్డి ముందుగానే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఉంటే ప్రీతి ఆత్మహత్య చేసుకొని ఉండేది కాదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నాగార్జునరెడ్దిపై చర్యలు తీసుకుంది.

కాగా, ప్రీతిది ఆత్మహత్య కాదని అది హత్యే అని ఆమె తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతికి సైఫే హానికరమైన ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని ఆయన అన్నారు. HOD నాగార్జున రెడ్డి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏంజరిగిందో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే తన కూతురు ఫోన్ చేసి తనను ఎవరైనా ఏదైనా చేస్తారనే భయంగా వుందని చెప్పిందని, అలా చెప్పిన కొద్దిసేపటికే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని నరేందర్ అన్నారు. ప్రీతిని సైఫ్ హత్య చేశాడని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు పంపానని ఆయన చెప్పారు..

First Published:  2 March 2023 3:05 PM GMT
Next Story