Telugu Global
Telangana

తెలంగాణలో నిరుపేద పిల్లలకు చేరువైన వైద్యవిద్య

వైద్య విద్యలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది యువతులే ఉన్నారని, మహిళా సాధికారతకు ఇదే నిదర్శనం అని చెప్పారు మంత్రి హరీష్ రావు.

తెలంగాణలో నిరుపేద పిల్లలకు చేరువైన వైద్యవిద్య
X

ఒకప్పుడు వైద్య విద్య అంటే అది గొప్పోళ్ల చదువు. మెరిట్ లో సీటు కొట్టాలంటే కష్టం, ఒకవేళ సీటొచ్చినా ఫీజులు భరించడం కూడా కష్టమే. అందుకే మధ్యతరగతి కుటుంబాల పిల్లలు విదేశాల్లో వైద్య విద్యకోసం క్యూకట్టేవారు. అక్కడ తక్కువ ఖర్చుకి ఎంబీబీఎస్ అయిందనిపించుకునేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ స్థాపన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దాని ఫలితంగా వైద్య విద్య, పేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. స్థానిక రిజర్వేషన్ తో తెలంగాణ విద్యార్థులకు మరింత ఊతం లభించింది.



మహిళా సాధికారత

జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతోందని ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. ఓ కూలి బిడ్డ, ఓ రైతు బిడ్డ, ఓ ఆటో డ్రైవర్ కొడుకు.. ఇలా ఎంతో మంది నిరుపేద పిల్లలకు నేడు వైద్య విద్య చేరువైందని అన్నారాయన. వైద్య విద్యలో సీట్లు పొందిన వారిలో ఎక్కువమంది యువతులే ఉన్నారని, మహిళా సాధికారతకు ఇదే నిదర్శనం అని చెప్పారు మంత్రి హరీష్.

రుణం తీర్చుకోవాలి..

తెలంగాణ ప్రభుత్వం అందించిన గొప్ప అవకాశాన్ని పేద కుటుంబాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్. విజయవంతంగా వైద్య విద్య పూర్తి చేసి పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి రుణం తీర్చుకోవాలని కోరారు. వైద్య విద్యలో చేరిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


First Published:  21 Sep 2023 5:43 AM GMT
Next Story