Telugu Global
Telangana

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ఈ కేసులో మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
X

మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలకు పాల్పడిందంటూ ఏపీ సీఐడీ పలు ఆధారాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ పలు శాఖల్లో సోదాలు నిర్వహించి ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ జివి రామ్ ప్రసాద్, రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ సత్తి రవిశంకర్, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ బండారు శ్రీనివాసరావు, గుంటూరు బ్రాంచ్ మేనేజర్ జి శివరామకృష్ణ లను అరెస్టు చేసింది.

కాగా, ఈ కేసులో మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించాలని కోరుతూ రామోజీరావు, శైలజాకిరణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. తమ క్లయింట్లపై వేధింపుల్లో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ ల్లో సోదాలు జరిగాయని మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టులో వాదించారు.

చిట్ ఫండ్ నిధులను ఇతర మ్యూచువల్ ఫండ్ ల‌కు బదిలీ చేశారన్న ఆరోపణలపై స్పందించిన‌ హైకోర్టు, నిధులను ఈ విధంగా మళ్లిస్తే దాన్ని నిధుల దుర్వినియోగం అనలేమని స్పష్టం చేసింది. ఖాతాదారులను మోసం చేశారని భావించలేమని తెలిపింది.

First Published:  21 March 2023 2:34 PM GMT
Next Story