Telugu Global
Telangana

కోమటి రెడ్డి వెంకట్రెడ్డిని గాంధీ భవన్ కు ఆహ్వానించిన మాణిక్ రావు ఠాక్రే... రాను పొమ్మన్న‌ కోమటి రెడ్డి

సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డికి మాణిక్ రావ్ ఠాక్రే ఫోన్ చేసి గాంధీ భవన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కోమటి రెడ్డి పిర్యాదులపై అక్కడే చర్చిద్దామని మాణిక్ రావ్ సూచించారు. అయితే మాణిక్ రావ్ ఠాక్రే ఆహ్వానాన్ని కోమటి రెడ్డి నిర్ద్వందంగా తిరస్కరించారు.

కోమటి రెడ్డి వెంకట్రెడ్డిని గాంధీ భవన్ కు ఆహ్వానించిన మాణిక్ రావు ఠాక్రే... రాను పొమ్మన్న‌ కోమటి రెడ్డి
X

ఏఐసీసీ తరపున తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్ గా నియమితులైన‌ సీనియర్ ఏఐసీసీ నాయకులు మాణిక్ రావ్ ఠాక్రే తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలందరితో విడి విడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో ఆయన చర్చలు జరిపారు. వారి వాదనలు విన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డికి ఫోన్ చేసి గాంధీ భవన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కోమటి రెడ్డి పిర్యాదులపై అక్కడే చర్చిద్దామని మాణిక్ రావ్ సూచించారు. అయితే మాణిక్ రావ్ ఠాక్రే ఆహ్వానాన్ని కోమటి రెడ్డి నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను గాంధీ భవన్ లో అడుగుపెట్టబోనని తేల్చి చెప్పారు. తనతో మాట్లాడాలని అనుకుంటే బైట ఎక్కడైనా సరే కలవడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.

కాగా వెంకట రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి వెంకటరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. ముఖ్యంగా మునుగోడు ఉప‌ ఎన్నిక సమయం నుండి ఆయన పార్టీకి పూర్తిగా దూరంఅయ్యారు. నిజం చెప్పాలంటే ఆయన ప్రస్తుతం సాంకేతికంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో వెంకట రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీతో సమావేశం కూడా అయ్యారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే వాదనలు వినిపిస్తున్న ఈ తరుణంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆయనను పిలవడం చ‌ర్చనీయాంశమైంది.

First Published:  11 Jan 2023 8:04 AM GMT
Next Story