Telugu Global
Telangana

కాంగ్రెస్‌ మేనిఫెస్టో రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే.!

పదో తరగతి నుంచి పీహెచ్‌డీలు చేసే విద్యార్థినులకు మెట్రో ప్రయాణాన్ని ఉచితంగా అందించాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఏపీ తరహాలో అమ్మ ఒడి స్కీమ్‌ తెచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది.

కాంగ్రెస్‌ మేనిఫెస్టో రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే.!
X

కాంగ్రెస్‌ మేనిఫెస్టో రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే.!

ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్‌.. మేనిఫెస్టో రిలీజ్‌కు కసరత్తు చేస్తోంది. మేనిఫెస్టో రూపకల్పన దాదాపు ఫైనల్ స్టేజ్‌ చేరుకుందని సమాచారం. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం.

ఇందులో భాగంగా పదో తరగతి నుంచి పీహెచ్‌డీలు చేసే విద్యార్థినులకు మెట్రో ప్రయాణాన్ని ఉచితంగా అందించాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఏపీ తరహాలో అమ్మ ఒడి స్కీమ్‌ తెచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. వార్డు మెంబర్లకు రూ.1500 గౌరవ వేతనం, హైదరాబాద్ అభివృద్ధికి స్పెషన్ ప్లాన్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. కల్యాణ లక్ష్మి తరహాలోనే ఆడపిల్ల పెళ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని యోచిస్తోంది.

ఈనెల 14న కాంగ్రెస్‌ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు అమలు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.

అవి ఏంటంటే.. మహాలక్ష్మి స్కీమ్‌ కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్‌, రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించనున్నారు. రైతు భరోసా కింద ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థికసాయం అందించనున్నారు. వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. గృహజ్యోతి కింద ఇళ్లలో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇవ్వనున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ కింద ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. యువ వికాసం స్కీం కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో కూడిన వడ్డీ రహిత ఆర్థిక సాయం అందించనున్నారు. చేయూత పథకం కింద ఫింఛనుదారులకు నెలకు రూ.4 వేల పెన్షన్, ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించనున్నారు.

First Published:  12 Nov 2023 3:30 AM GMT
Next Story