Telugu Global
Telangana

మియాపూర్‌లో కాల్పుల కల‌క‌లం

కాల్పుల‌కు గురైన దేవేంద‌ర్ కోల్‌క‌తాకు చెందిన‌వాడని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దేశ‌వాళీ తుపాకీతో దేవేంద‌ర్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జ‌రిపార‌ని వారు చెప్పారు.

మియాపూర్‌లో కాల్పుల కల‌క‌లం
X

మియాపూర్‌లో బుధ‌వారం రాత్రి కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్ (35)పై గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మియాపూర్ పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

కాల్పుల‌కు గురైన దేవేంద‌ర్ కోల్‌క‌తాకు చెందిన‌వాడని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దేశ‌వాళీ తుపాకీతో దేవేంద‌ర్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జ‌రిపార‌ని వారు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన దేవేంద‌ర్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గంలోనే ప్రాణాలు కోల్పోయాడ‌ని వివ‌రించారు.

సంఘ‌ట‌న జ‌రిగింద‌ని స‌మాచారం తెలియ‌గానే మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్‌రావు, మియాపూర్ ఏసీపీ న‌ర‌సింహారావు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. పాత క‌క్ష‌లో ఈ ఘ‌ట‌న‌కు కార‌ణంగా భావిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా వారు తెలిపారు. త్వ‌ర‌లో నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా డీసీపీ స్ప‌ష్టం చేశారు.

*

First Published:  24 Aug 2023 2:37 AM GMT
Next Story