Telugu Global
Telangana

కార్ వాష్‌కు వెళ్లి.. ఆస్ట్రేలియాలో షాద్‌న‌గ‌ర్ వాసి అనుమానాస్ప‌ద మృతి

ఉద్యోగ‌రీత్యా సిడ్నీలో స్థిర‌ప‌డిన అర‌వింద్ యాద‌వ్‌కు వివాహ‌మైంది. ఆయ‌న భార్య గ‌ర్భిణి. స్వదేశానికి వ‌చ్చేందుకు సోమ‌వారానికి టికెట్లు బుక్ చేసుకున్నారు.

కార్ వాష్‌కు వెళ్లి.. ఆస్ట్రేలియాలో షాద్‌న‌గ‌ర్ వాసి అనుమానాస్ప‌ద మృతి
X

విదేశాల్లో మ‌రో భార‌తీయ యువ‌కుడి మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటుచేసుకుంది. అక్క‌డ స్థిర‌ప‌డిన తెలుగువాడు ఆర‌టి అర‌వింద యాద‌వ్ (30) అనుమానాస్ప‌ద స్థితిలో స‌ముద్రం ఒడ్డున శ‌వ‌మై తేలాడు. అర‌వింద్ తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్‌కు చెందిన బీజేపీ నేత ఆర‌టి కృష్ణ ఏకైక కుమారుడు.

ఐదు రోజుల కింద‌ట అదృశ్యం

ఉద్యోగ‌రీత్యా సిడ్నీలో స్థిర‌ప‌డిన అర‌వింద్ యాద‌వ్‌కు వివాహ‌మైంది. ఆయ‌న భార్య గ‌ర్భిణి. స్వదేశానికి వ‌చ్చేందుకు సోమ‌వారానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. దానికి ముందు కార్ వాష్ చేయించుకోవ‌డానికి వెళ్లిన అర‌వింద్ తిరిగి రాలేదు. పోలీసులూ అత‌ని ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈలోగా అత‌ని మృత‌దేహం స‌ముద్రం ఒడ్డున క‌నిపించ‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.

చంపేశారా..?

ఈ ఏడాది జ‌న‌వరి నుంచి అమెరికాలో ఇలాంటి ఘ‌ట‌న‌లు మూడు జ‌రిగాయి. అయితే వారిని కిడ్నాప్ చేసిన‌ట్లు, త‌ర్వాత చంపేసిన‌ట్లు ఆధారాలు ల‌భించాయి. కానీ, అర‌వింద్ గురించి అలాంటి స‌మాచారం కూడా ఏమీ అంద‌లేదు. అయితే కార్ వాష్‌కు అని వెళ్లిన వ్య‌క్తి.. ఐదు రోజుల త‌ర్వాత బీచ్‌లో శ‌వ‌మై తేల‌డంతో ఎవ‌రో అత‌న్ని హ‌త్య చేసి అక్క‌డ ప‌డేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

First Published:  24 May 2024 8:48 AM GMT
Next Story