Telugu Global
Telangana

జహీరాబాద్‌లో రానున్న మహీంద్రా ఈవీ యూనిట్

భవిష్యత్‌లో కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహేంద్ర కంపెనీ తెలిపింది.

జహీరాబాద్‌లో రానున్న మహీంద్రా ఈవీ యూనిట్
X

మహీంద్రా & మహీంద్రా జహీరాబాద్‌లో మూడు, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం మహేంద్రా కంపెనీ సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. 800-1,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది.

భవిష్యత్‌లో కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహేంద్ర కంపెనీ తెలిపింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగాభారతదేశంలో సస్టెయినబుల్‌ మొబిలీటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా ఇవాళ మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీతో ఎంఓయూ కుదిరిందని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆటో & ఫార్మ్) రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ, తెలంగాణ తమతో సుదీర్ఘ భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. “మా కొత్త EV తయారీ కోసం జహీరాబాద్‌లో ప్రస్తుత తయారీ యూనిట్‌ను విస్తరించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఇది

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కేటగిరీలో మా నాయకత్వ స్థానాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది” అని ఆయన అన్నారు.

కంపెనీ జహీరాబాద్‌లో ఉన్న తయారీ ప్లాంట్‌ను మరింత విస్తరించడం ద్వారా త్రీ వీలర్ కేటగిరీలో మరిన్ని వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు రాజేష్ వెల్లడించారు. తాజా పెట్టుబడితో త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి (పెట్టుబడి ప్రమోషన్) డాక్టర్ ఈ విష్ణువర్ధన్ రెడ్డి, ఆటోమోటివ్, ఈవీ సెక్టార్ డైరెక్టర్ గోపాలకృష్ణన్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

First Published:  10 Feb 2023 1:42 AM GMT
Next Story